అనుమానాస్పదంగా బ్యుటీషియన్ మృతి

హైదరాబాద్: అనుమానాస్పదంగా యువతి మరణించిన సంఘటన సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగితెలుసుకున్నారు.

అయితే ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డెడ్ బాడీనీ పోస్టుమార్టం కోసం ఉస్మానియా హస్పిటల్‌కి  తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates