రేప్ కేసులో బీజేపీ మాజీ మంత్రి అరెస్ట్

అత్యాచారం కేసులో మాజీ మంత్రి, బీజేపీ నేత చిన్మయానందను  ఉత్తర ప్రదేశ్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. లా చదువుతున్న 23 ఏళ్ల యువతిని ఏడాది కాలంగా రేప్ చేసిన కేసులో చిన్మయానంద(73)ను ఇవాళ అరెస్ట్ చేశారు. లా కాలేజీలో సీటు ఇప్పిస్తానని ఆశపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఇదే విషయాన్ని ఆమె కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా చెప్పింది.

తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్ కూడా చేయించుకున్నాడని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం షాజహాన్ పూర్ లోని చిన్మయానంద ఆశ్రమానికి చేరుకున్న సిట్ అధికారులు.. చిన్మయానందను అరెస్ట్ చేశారు. తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Latest Updates