నన్ను ఏ చట్టం టచ్ చేయలేదు.. నేను పరమ శివుణ్ణి

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానంద స్వామి. ఆయన దేశం నుంచి పారిపోయి విదేశాలలో తల దాచుకుంటున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక దీవికి ‘కైలాస దేశం’గా పేరు పెట్టి తన భక్తులతో అక్కడే ఉంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ‘నన్ను ఏ చట్టం టచ్ చేయలేదు. నన్ను ఏ కోర్టు కూడా విచారించలేదు. మీరు నా దగ్గర ఉన్నంతకాలం మీకు చావు లేదు. నన్ను నమ్మొద్దు, నా దగ్గరికి రావొద్దని ప్రభుత్వాలు చెప్పినా మీరు నా దగ్గరికి వచ్చి మీ చిత్తశుద్ధిని, ఏకాగ్రతను నిరూపించారు. నేను కూడా సత్యాన్ని వెల్లడించి మీ పట్ల నాకున్న చిత్తశుద్ధిని మీకు చూపిస్తాను. ఆ నిజం ఏంటంటే.. నేనే పరమ శివుణ్ణి. నేను మీకు మరణం లేకుండా చేస్తాను’ అని ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

శుక్రవారం విదేశాంగ శాఖ నిత్యానంద పాస్‌పోర్టును రద్దు చేసిన విషయం విధితమే. గతంలో ఆయన అత్యాచారం ఆరోపణల కేసులో 2010లో హిమాచల్ ప్రదేశ్‌లో అరెస్టయ్యారు.

For More details..

భూకైలాసం ప్రత్యేక దేశం అయితదా!

Latest Updates