గోల్డ్ స్మగ్లింగ్ కు ఆ ఐఏఎస్ కు ఎలాంటి సంబంధం లేదు

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరిన్ని విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన స్వప్న సురేష్ కు  కేరళ సీఎం పినరయి విజయన్ మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు మధ్య సంబంధాలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఈడీ అధికారులు స్వప్నసురేష్ ను విచారించగా..  గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో అరెస్టైన వారికి ఆయనకు సంబంధాలు లేవని స్వప్న సురేష్ ఈడీ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నేషనల్ బ్యాంక్ లో స్వప్న సురేష్ సీక్రెట్ లాకర్లు తెరవడానికి ఐఏఎస్ అధికారి శివశంకర్ సహాయం చేశారని , అందులో తాను డబ్బు, బంగారం దాచి పెడుతున్నానని ఆయనకు ఏమాత్రం తెలీదని స్వప్న సురేష్ కస్టమ్స్ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Latest Updates