శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం

రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. సైబరాబాద్ లో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతున్నామని చెప్పారు.  హైదరాబాద్ నోవాటెల్ లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళ భద్రత సదస్సును ఐజీ స్వాతి లక్రా.. ప్రారంభించారు. షీ ఎంపవర్ అవార్డులను అందజేశారు.

మహిళల భద్రతపై ఏర్పాటు చేసిన ‘షీ సేఫ్ యాప్’  లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి సాయి పల్లవితో వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Latest Updates