గెలుపు తేలకముందే.. పార్టీ ఆఫీసులో సంబరాలకు లడ్డూ రెడీ!

  • మహారాష్ట్రలో విజయంపై బీజేపీ ధీమా
  • ముంబై ఆపీసులు స్వీట్లు సిద్ధం చేసిన నేతలు

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓటరు దేవుళ్లు తమ అమూల్యమైన ఓటు అనే ఆయుధంతో ఏ పార్టీకి పోటు పొడవాలి.. ఎవరికి పట్టం కట్టాలి అనేది నిర్ణయించేశారు. ఈవీఎంల్లో ఓట్లన్నీ నిక్షిప్తం అయ్యాయి.

గెలుపుపై అన్ని పార్టీలూ ధీమాగానే ఉన్నాయి. ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. తమదే అధికారం అని గట్టిగా చెబుతున్నాయి. కానీ, కౌంటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం దాటితే గానీ ఫలితం ఓ కొలిక్కి రాదు.

తిరుగులేదన్న నమ్మకం

అయితే మహారాష్ట్రలో బీజేపీ నేతలు ససేమిరా తాము తప్ప ఎవరికీ అధికారం దక్కే చాన్సే లేదని బల్లగుద్దిమరీ చెబుతున్నారు. కౌంటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే బుధవారం సాయంత్రమే సంబరాలకు సిద్ధమైపోయారు. ముంబైలోని పార్టీ ఆఫీసులు లడ్డూలు తయారు చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే కార్యకర్తలు, నాయకులు తియ్యని వేడుక చేసుకునేందుకు రెడీగా ఉన్నామని చెబుతున్నారు. తమ విజయం విషయంలో తిరుగులేదంటున్నారు.

Latest Updates