గాయాలిక వెంటనే మానుతాయ్

తగిలిన దెబ్బ మానడానికి వారంపైగా పడుతుంది. డయాబెటిక్‌‌‌‌‌‌‌‌ పేషెంట్లకైతే గాయం మానాలంటే ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గాయం వెంటనే మానేలా, దానిపై కొత్త చర్మం వచ్చేలా అమెరికా వేక్‌‌‌‌‌‌‌‌ ఫారె స్ట్‌‌‌‌‌‌‌‌ ఇనిస్టి ట్యూట్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ రీజనరేటివ్‌‌‌‌‌‌‌‌ మెడిసిన్‌‌‌‌‌‌‌‌ సైంటిస్టులు మొబైల్ బయోప్రింటర్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను తయారు చేశారు. గాయాన్ని స్కాన్ చేసి లోపలి నుంచి అది మానేలా అవసరమైన జీవకణాలను ఇది ప్రింట్ చేస్తుందని చెబుతున్నారు.

‘‘చర్మంలోని ప్రధానమైన ఫైబ్రోబ్లాస్స్ట్ , ఎపిడెర్మల్ కెరాటినోసైట్స్ జీవకణాలను బయాప్సీ ద్వారా వేరు చేసి అవి విస్తరించేలా చేస్తాం. గాయం మానడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి’’ అని సైంటిస్టులు చెబుతున్నారు .

Latest Updates