కమీషన్ తగ్గిందని స్విగ్గి డెలివరీ బాయ్స్ ధర్నా

హైదరాబాద్: స్విగ్గి కంపెనీ యాజమాన్యం.. తమకు కమీషన్ తక్కువగా ఇస్తుందని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు స్విగ్గి డెలివరీ బాయ్స్.  ఈ సంఘటన హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. గతంలో 2 కిలోమీటర్ల పరిదిలోపు ఒక డెలివరీ ఐటెమ్ కు 35 రూపాయల కమీషన్ ఇచ్చే స్వగ్గి..ప్రస్తుతం ఒక కిలోమీటర్ పరిదిలోపు డెలివరీ చేస్తే.. కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తుందని మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.

స్విగ్గి కంపెనీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతుందన్న స్విగ్గి డెలివరీ బాయ్స్ .. థర్టీ పార్టీకి ఎక్కువ కమీషన్ ఇస్తూ… తమకు మాత్రం తక్కువ కమీషన్ ఇస్తుందన్నారు. తమను మోసం చేస్తున్న స్వగ్గి కంపెనీపై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు స్వగ్గి బాధితులు. స్టేషన్ కు వచ్చిన స్వగ్గి ప్రతినిధులు..  రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే.. హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు స్వగ్గి డెలివరీ బాయ్స్.

Latest Updates