బైక్ ను ఢీకొన్న కారు.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

మాదాపూర్ లో బైక్ ను ఢీకొట్టింది ఓ కారు. ఈ ఘటనలో బైకర్ చనిపోయాడు. ఆనంద్ కుమార్(28) అనే.. స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ హైటెక్ సిటీ సైబర్ టవర్ ఫ్లైఓవర్ పై వెళ్తుండగా.. అతని బైక్ ను AP11 AA 5382 అనే హ్యుండయ్ కారు ఢీకొట్టంది. దీంతో ఆనంద్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆనంద్ కుమార్ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలిచారు.

ఆనంద్ కుమార్ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ మణికొండలోని అల్కాపూర్ లో నివాసం ఉంటున్నాడు. అతని సొంత ఊరు వికారాబాద్ జిల్లాలోని బొమ్మిరెడ్డి పల్లెగా పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా ఆనంద్ స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.

Latest Updates