బైక్​ వద్దు సైకిలే ముద్దు

న్యూఢిల్లీ : దేశీయ ఆన్‌ లైన్ ఫుడ్ ఆర్డరింగ్,డెలివరీ ప్లాట్‌ ఫామ్ స్విగ్గీ నెలకు 15 లక్షలకుపైగా ఆర్డర్లను మెకానికల్ సైకిళ్లపైనే డెలివరీ చేస్తోంది. 120కి పైగా నగరాల్లో 1.7 లక్షలడెలివరీ పార్టనర్లతో ఈ కార్యకలాపాలు సాగిస్తోంది. ‘గత రెండేళ్ల నుంచే పర్యావరణహితమైన (గోగ్రీన్‌ ) డెలివరీలను చేపట్టడం ప్రారంభించాం. ప్రతి రోజూ 10వేల మంది పార్టనర్లు సైకిళ్లపై డెలివరీలు చేపడుతున్నారు. కొన్ని నగరాల్లో బైకుల కంటే చాలా తక్కువ సమయంలో సైకిళ్లే డెలివరీలు చేస్తున్నాయి’ అని స్విగ్గీ మార్కె టింగ్ వైస్‌ ప్రెసిడెంట్ శ్రీవాట్స్ టీఎస్‌ అన్నారు. భవిష్యత్తులో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ మరింత ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పారు. ఫుడ్ టెక్‌ లో సైకిల్, ఈవీ లాజిస్టిక్సే తర్వాత తరం గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు.

Latest Updates