నష్టాలు నాలుగింతలైన స్విగ్గీ

ఆదాయమూ పెరిగింది
పెట్టుబడుల ఫలితం భవిష్యత్‌ లో కనబడుతుంది : స్విగ్గీ

పుడ్ డెలివరీ స్టార్టప్ స్వి గ్గీ రూ. 2,367 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2018 లో ప్రకటించి న రూ. 385
కోట్లు కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఆపరేషనల్ ఖర్చు లు నాలుగింతలు పెరగడంతో నష్టాలు బాగా పెరిగాయని కంపెనీ తెలిపింది. కంపెనీ ఆదాయం రూ. 1,128.3 కోట్లకు పెరిగింది. ఇది ఆర్థిక సంవత్సరం 2018 లో ప్రకటించి న రూ. 417 కోట్లు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. “ ఆన్‌‌లైన్ పుడ్ డెలివరీ​ మార్కెట్‌ లో మేము కీలకంగాఎదుగుతున్నాం. ఆర్థిక సంవత్సరం 2018–19 లో కంపెనీ ఆర్డర్ వాల్యుమ్ 4.2 రెట్లు, ఆపరేటింగ్ రెవెన్యూ 2.8 రెట్లు పెరిగింది. దీర్ఘకాలంలో వృద్ధి చెందేందుకు కంపెనీ ఇప్పటికే టెక్నాలజీ, బ్రాండ్, సప్లయ్ క్రియేషన్ వంటి విభాగాలలో ఇన్వెస్ట్‌‌చేసింది. వీటి ఫలితం భవిష్యత్తులో కనిపిస్తుం ది” అని స్వి గ్గీ మీడియా ప్రతినిధి అన్నారు. కంపెనీ రెవెన్యూలో అధిక భాగం మార్కెట్​ప్లేస్​ ఆపరేషన్స్ వలన వచ్చాయి . వీటి వలన కంపెనీ రూ. 1,074.1 కోట్ల రెవెన్యూను ఆర్జించింది. స్వి గ్గీ ప్రైవేట్ బ్రాండ్‌‌పై నడుస్తున్న డెలి వరీ ఓన్లీ మోడల్ లేదా క్లౌడ్ కిచెన్ వలన కంపెనీ రూ. 67.5 కోట్లు లేదా కంపెనీ మొత్తం రెవెన్యూలో 6 శాతం వచ్చిం ది. ఆర్థిక సంవత్సరం 2019లో స్వి గ్గీ ఖర్చు లు భారీగా పెరిగాయి.

కంపెనీ ఖర్చు లు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,659.1 కోట్లుగా నమోదయ్యాయి . ఇది ఆర్థిక సంవత్సరం 2018 లో రూ. 841.4 కోట్లుగా ఉన్నాయి . కంపెనీ ఖర్చు లలో రూ. 1,681.2 కోట్లు ఆపరేషనల్ ఖర్చు లుగా ఉన్నాయి . కేవలం పుడ్ డెలివరీ ఖర్చులే రూ. 1,594 కోట్లుగానమోదయ్యాయి . డెలివరీ ఇవ్వని ఆర్డర్లపై రూ. 113.4 కోట్లు ఖర్చయిందని, దానిని నష్టం గా లెక్కించామని కూడా కంపెనీ తెలిపింది. డెలివరీ పార్ట్‌‌నర్స్‌‌ తీసుకున్నాక, కస్టమర్లు కేన్సిల్‌‌ చేసిన ఆర్డర్లూ ఇందులో ఉన్నాయని పేర్కొం ది. కొంత మంది డెలివరీ పార్ట్‌‌నర్స్‌‌ డబ్బుతో పారిపోయారనీ, ఆ నష్టాలూ ఇందులోనే ఉన్నాయని వివరించింది. స్వి గ్గీ రోజూ 14 లక్షల ఫుడ్‌‌ ఆర్డర్లను నెరవేరుస్తోంది. అంతకు ముందు ఏడాదిలో ఇది 7 లక్షలు మాత్రమే. దేశంలోని 500 సిటీలు, టౌన్‌‌లలో స్వి గ్గీ సేవలు అందుబాటులోకి వచ్చాయి . స్వి గ్గీ ప్లాట్‌ ఫామ్‌‌పై 1.40 లక్షల రెస్టార ెంట్లు ఉండగా, డెలివరీ పార్ట్‌‌నర్లు 2.1 లక్షల మంది. రాబోయే ఏడాది కాలంలో మరో వంద సిటీలకు విస్తరించాలనేది స్వి గ్గీ టార్గెట్‌ . స్వి గ్గీకి ప్రధాన పోటీదారైన జొమాటో కూడా 500 సిటీలకు విస్తరించి నట్లు చెప్పుకుంటోంది.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates