స్విగ్గిలో కొత్త సేవలు..పికప్ అండ్ డ్రాప్ కూడా…

ఇప్పటి వరకు ఆన్ లైన  ఫుడ్ డెలీవరీ స్విగ్గీ సంస్థ మరో కొత్త యాప్ ను ప్రారంభించింది. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు బెంగళూరులో స్విగ్గి గో అనే యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా  పికప్ అండ్ డ్రాప్ సేవలు అందుబాటులో  ఉంటాయి. ఎవరికైనా ఏమైనా వస్తువులు , కానీ  నిత్యవసర వస్తువులు కానీ పార్సల్స్ డోర్ డెలీవరీ చేయాలన్నా…వేరే చోటకి పంపియాలన్నా  ఈ యాప్ ఉపయోగపడుతుంది.  వీటిని త్వరలోనే బెంగళూరు, హైదరాబాద్ లో  విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో శ్రీహర్ష మెజెటీ చెప్పారు. 2020 నాటికి కనీసం 300 నగరాలకు తన ‘స్విగ్గి గో’ సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Latest Updates