విస్తరిస్తున్న స్విగ్గీ: కావల్సినవన్నీ డోర్ డెలివరి

ఫుడ్ డెలివరి రంగంలో తనదైన గుర్తింపును పొందిన స్విగ్గీ.. ఇకపై ఇంటికి కావలసిన వస్తువులనూ డోర్ డెలివరి చేయడానికి సిధ్దమవుతుంది. ఇందుకు ‘స్విగ్గీ స్టోర్స్’ అనే యాప్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయింది. ఈ విషయాన్ని మంగళవారం తెలిపారు ఆ సంస్థ అధికారులు.

‘స్విగ్గీ స్టోర్స్’  ద్వారా..  పండ్లు, కూరగాయలు, హెల్త్ ప్రొడక్ట్స్, బేబీ కేర్, వంటివి డోర్ డెలివరి చేయనున్నామని తెలిపింది స్విగ్గీ. ఈ యాప్..  ముందుగా బెంగళూరులో అందుబాటులోకి రానుందని తెలిపారు. దేశంలో దాదాపు 80 కంటే ఎక్కువ నగరాలలో స్విగ్గీ విస్తరించింది

Latest Updates