స్విస్‌ బ్యాంకుల్లో మనోళ్ల డబ్బు తగ్గుతోంది

  • 77వ స్థానానికి పడిన ఇండియా ర్యాంక్
  • ఇండియన్ల వాటా కేవలం 0.06 శాతమే
  • 27శాతం వాటాతో టాప్ లో యూకే
  • స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడి

న్యూఢిల్లీ : స్విస్ బ్యాంక్‌‌‌‌లలో ఇండియన్లు దాచుకునే మనీ ఏటేటా తగ్గుతోంది. 2019 ఏడాది స్విస్ బ్యాంక్‌‌‌‌లలో ఇండియన్ సిటిజన్లు, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజస్ దాచి ఉంచుకున్న డబ్బులను బట్టి ఇండియా ర్యాంక్ మూడు స్థానాలు కిందకి పడిపోయి 77గా ఉంది. 2018లో ఇండియా ర్యాంక్‌‌‌‌ 74గా ఉండేది. ఈ ర్యాంక్‌‌‌‌ల్లో యూకే టాప్ పొజిషన్‌‌‌‌లో ఉంది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది. స్విస్ నేషనల్ బ్యాంక్(ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌బీ) ప్రతేడాది తను అనాలసిస్‌‌‌‌ చేసిన యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటస్టిక్స్‌‌‌‌ను విడుదల చేస్తోంది. ఇండియా ర్యాంక్ కిందకు పడిపోతోందని స్విస్ సెంట్రల్ బ్యాంక్ చెప్పింది. స్విట్జర్లాండ్‌‌‌‌కు చెందిన బ్యాంక్‌‌‌‌లలో ఫారిన్ క్లయింట్స్ దాచుకున్న మొత్తం ఫండ్స్‌‌‌‌లో ఇండియన్ సిటిజన్లు, సంస్థల వాటా కేవలం 0.06 శాతమేనని తెలిపింది. 2019 ఏడాది టాప్ ర్యాంక్ దక్కించుకున్న యూకేకు మొత్తం ఫారిన్ ఫండ్స్‌‌‌‌లో 27 శాతం వాటా ఉన్నట్టు వెల్లడించింది.

ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌బీ తాజా డేటా ప్రకారం, ఇండియన్ సిటిజన్లు, సంస్థలు, ఇండియాలోని బ్రాంచ్‌‌‌‌ల ద్వారా స్విస్ బ్యాంక్‌‌‌‌లలో దాచుకున్న నగదు గతేడాది 5.8 శాతం తగ్గిపోయి రూ.6,625 కోట్లుగా ఉన్నాయి. ఈ డేటాలో స్విస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లలో ఇండియన్ క్లయింట్స్‌‌‌‌కు చెందిన అన్ని అకౌంట్ల ఫండ్స్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తులు, సంస్థలు, బ్యాంక్‌‌‌‌లకు చెందిన డిపాజిట్లను అన్నింటినీ లెక్కకట్టింది. ఇండియాలో స్విస్ బ్యాంక్‌‌‌‌ల బ్రాంచ్‌‌‌‌ల డేటాను కూడా కలిపింది. అలానే నాన్ డిపాజిట్ లయబులిటీలను లెక్కల్లోకి తీసుకున్నట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ చెప్పింది. ఈ అధికారిక లెక్కలను బ్యాంక్‌‌‌‌లు ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌బీకి రిపోర్ట్ చేస్తాయి. అయితే ఈ లెక్కల్లో థర్డ్ కంట్రీ ఎంటిటీ పేర్లతో ఇండియన్లు, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు, ఇతరులు స్విస్ బ్యాంక్‌‌‌‌లలో డిపాజిట్ చేస్తే మాత్రం వాటిని కలపరు.
స్విస్ బ్యాంక్‌‌‌‌లలోని విదేశీ ఫండ్స్ విషయంలో టాప్ ర్యాంక్ సంపాదించుకున్న యూకే తర్వాత, అమెరికా, వెస్ట్ ఇండీస్, ఫ్రాన్స్‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌లు టాప్‌‌‌‌ 5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ఫారిన్ ఫండ్స్ విషయంలో ఈ టాప్ 5 దేశాల వాటానే 50 శాతానికి పైగా ఉన్నట్టు ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌బీ చెప్పింది. టాప్ 10 అకౌంట్‌‌‌‌లు సుమారు మూడింట రెండో వంతు ఉన్నట్టు పేర్కొంది. స్విస్ బ్యాంక్‌‌‌‌లలో మొత్తం ఫారిన్‌‌‌‌ మనీలో టాప్ 15 దేశాల వాటా 75 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. అలాగే టాప్ 30 దేశాల వాటా 90 శాతంగా ఉన్నట్టు అధికారిక డేటాలో ప్రకటించింది. టాప్ 10 దేశాల్లో జర్మనీ, లక్సెంబర్గ్, బహామాస్, సింగపూర్, కేమాన్ ఐల్యాండ్స్ ఉన్నాయి. స్విస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లలోని మొత్తం ఫారిన్ ఫండ్స్‌‌‌‌లో 22 దేశాల వాటా కేవలం 1 శాతానికి పైగానే ఉంది. ఆ దేశాల్లో చైనా, జెర్సీ, రష్యా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, పనామా, ఇటలీ, యూఏఈ, నెదర్లాండ్స్, జపాన్‌‌‌‌లు ఉన్నాయి.
2008 నుంచి తగ్గుతున్న ఇండియా ర్యాంక్…
2018లో స్విట్జర్లాండ్ బ్యాంక్‌‌‌‌లలోని ఇండియన్ల ఫండ్స్ అధికారికంగా మొత్తం ఫండ్స్‌‌‌‌లో 0.07 శాతం ఉన్నాయి. 2016లో ఇవి 0.04 శాతంగానే ఉండేవి. 1996 నుంచి 2007 వరకు స్విస్ బ్యాంక్‌‌‌‌లలో మొత్తం హోల్డింగ్స్‌‌‌‌లో ఇండియా టాప్ 50 దేశాల్లో ఉండేది. 2004లో ఇండియా అత్యధికంగా 37గా ఉంది. 2008 నుంచి ఇండియా ర్యాంక్ తగ్గడం ప్రారంభమైంది. 2019లో స్విస్ బ్యాంక్‌‌‌‌లలోని మొత్తం ఫారిన్ ఫండ్స్‌‌‌‌ స్వల్పంగా పెరిగి 1.44 ట్రిలియన్ సీహెచ్‌‌‌‌ఎఫ్‌‌‌‌గా ఉన్నాయి.
బ్రిక్స్ దేశాల్లో ఇండియాకే తక్కువ ర్యాంక్….
బ్రిక్స్‌‌‌‌ లోని ఐదు దేశాలను తీసుకుంటే, స్విస్ బ్యాంక్‌‌‌‌లలోని మనీ విషయంలో 2019లో ఇండియా అత్యంత తక్కువ ర్యాంక్‌‌‌‌ను పొందింది. అత్యధిక ర్యాంక్‌‌‌‌ను అంటే 20వ స్థానాన్ని రష్యా పొందింది. ఆ తర్వాత 22వ ర్యాంక్‌‌‌‌ చైనాకు, దక్షిణాఫ్రికాకు 56వ ర్యాంక్, బ్రెజిల్‌‌‌‌కు 62వ ర్యాంక్ వచ్చాయి. ఇండియా కంటే ఎక్కువ ర్యాంక్‌‌‌‌ పొందిన దేశాల్లో కెన్యా(74వ ర్యాంక్), మారిషస్(68వ ర్యాంక్), న్యూజిలాండ్(67వ ర్యాంక్),వెనిజులా(61వ ర్యాంక్), ఉక్రేయిన్(58వ ర్యాంక్), ఫిలిప్పీన్స్(51వ ర్యాంక్), మలేషియా(49వ ర్యాంక్), ఇండోనేషియా(44వ ర్యాంక్), సౌత్ కొరియా(41వ ర్యాంక్), థాయ్‌‌‌‌ల్యాండ్(37వ ర్యాంక్), కెనడా(36వ ర్యాంక్), ఇజ్రాయిల్(28వ ర్యాంక్), టర్కీ(26వ ర్యాంక్), మెక్సికో(26వ ర్యాంక్), తైవాన్(24వ ర్యాంక్), సౌదీ అరేబియా(19వ ర్యాంక్), ఆస్ట్రేలియా(18వ ర్యాంక్), ఇటలీ(16వ ర్యాంక్), యూఏఈ(14వ ర్యాంక్), నెదర్లాండ్స్(13వ ర్యాంక్), జపాన్(12వ ర్యాంక్)లు ఉన్నాయి. ఇండియా పొరుగు దేశాలు పాకిస్తాన్ 99వ ర్యాంక్‌‌‌‌ను, బంగ్లాదేశ్‌‌‌‌ 85వ ర్యాంక్‌‌‌‌ను, నేపాల్‌‌‌‌ 118వ ర్యాంక్‌‌‌‌ను, శ్రీలంక 148వ ర్యాంక్‌‌‌‌ను, మయన్మార్‌‌‌‌‌‌‌‌ 186వ ర్యాంక్‌‌‌‌ను, భూటాన్‌‌‌‌ 196వ ర్యాంక్‌‌‌‌ను పొందాయి.

బయటికి వెల్లడవుతోన్న సీక్రెసీ….
స్విస్ బ్యాంక్‌‌‌‌లలో ఫారిన్ దేశాల ఫండ్స్‌‌‌‌ ఇటీవల కాలంలో తగ్గిపోతున్నా యి. స్వదేశాల్లో పన్ను లను తప్పిం చుకునేం దుకు చాలా సంస్థలు,  వ్యక్తులు‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లలో మనీని డిపాజిట్ చేసేవారు. స్విస్ బ్యాంక్‌‌‌‌ల డేటా ఇటీవల బయటికి వెల్లడిస్తుండటంతో, ఈ డిపాజిట్లు కాస్త తగ్గుతున్నాయి. స్విట్జర్లాం డ్ ఇండియాతో, ఇతర దేశాలతో ఆటోమేటిక్ ఇన్‌ ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ ఒప్పం దం కుదుర్చుకుంది. దీంతో స్విస్ బ్యాంక్‌‌‌‌ల సీక్రెసీ బయటికి వెల్లడవుతోంది. అక్రమ ఫండ్స్‌‌‌‌కు సంబంధిం చిన ఇన్‌ ఫర్మేషన్‌ ఇండియాకు గతేడాది నుంచే ఆటోమేటిక్‌‌‌‌గా వస్తోంది.

Latest Updates