స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవాళ్ల లిస్ట్‌ వచ్చింది

ఏఈవోఐ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ కింద సమాచార మార్పిడి
ఎన్ని అకౌంట్ల వివరాలిచ్చారో చెప్పని స్విస్ అధికారులు

అత్యంత రహస్యంగా
ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్‌

న్యూఢిల్లీ/బెర్నెబ్లాక్ మనీపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. స్విట్జర్లాండ్​లో బ్యాంకు అకౌంట్లు ఉన్న ఇండియన్ల తొలి జాబితాను సాధించింది. ఆటోమెటిక్ ఎక్స్​చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఫ్రేమ్ వర్క్ కింద ఈ సమాచారాన్ని పొందింది. 2018లో ఏఈవోఐ ఫ్రేమ్​వర్క్ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన ఖాతాలు యాక్టివ్​గా ఉన్న ఫైనాన్షియల్ అకౌంట్ల వివరాలను సేకరించింది. ‘‘స్విస్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​టీఏ)​తో సమాచారం పంచుకుంటున్న 75 దేశాల్లో ఇండియా ఒకటి. స్విస్ అకౌంట్లు ఉన్న ఇండియన్ల తర్వాతి జాబితా ఎక్స్చేంజ్‌ 2020 సెప్టెంబర్​లో జరుగుతుంది” అని ఎఫ్​టీఏ స్పోక్స్​పర్సన్ ఒకరు చెప్పారు. ఏఈవోఐ కింద స్విస్ అధికారుల నుంచి ఇండియా సమాచారం పొందడం ఇదే తొలిసారి.

అంతా సీక్రెట్..

స్విస్ ఖాతాల సమాచార మార్పిడిని కఠినమైన కాన్ఫిడెన్షియాలిటీ క్లాజుల ద్వారా జరిపారు. ఎఫ్​టీఏ అధికారులు.. ఇండియాకు అందజేసిన బ్యాంకు ఖాతాల వివరాలేవీ వెల్లడించలేదు. ఎన్ని ఖాతాల వివరాలిచ్చారు? అందులో ఎవరెవరున్నారు? ఖాతాల వివరాలు ఇచ్చిన వ్యక్తుల అకౌంట్లలో ఎంత డబ్బు ఉంది? వంటి సమాచారమేదీ బయటకు చెప్పలేదు. వివరాలు ఇచ్చిన ఖాతాల్లో వ్యాపారం కోసం, ఇతర జెన్యూన్ అవసరాల కోసం నిర్వహిస్తున్న ఖాతాలు కూడా ఉండొచ్చని అధికారులు చెప్పారు.

ఎక్కువ మంది వీళ్లే…!!

ఎఫ్​టీఏలోని కొందరు అధికారులు చెప్పిన దాని ప్రకారం.. ఇండియా లిస్టులో ఎక్కువ మంది వ్యాపారులు ఉన్నారు. సౌత్​ఈస్ట్ ఆసియా దేశాలు, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, సౌతాఫ్రికా దేశాల్లో ఉంటున్న నాన్​రెసిడెంట్ ఇండియన్లు (ఎన్నారైలు) కూడా ఇందులో ఉన్నారు.  2018కి ముందు క్లోజ్ చేసిన 100 పాత ఖాతాల వివరాలను కూడా ఇండియా పొందింది. ఈ ఖాతాల ఓనర్లు.. ట్యాక్స్​కు సంబంధించి అవినీతి చేశారంటూ స్ర్టాంగ్ ఎవిడెన్స్ చూపినట్లు అధికారులు చెప్పారు. ఈ 100 మందిలో కెమికల్స్, ఆటోమొబైల్స్, టెక్స్​టైల్స్, రియల్​ఎస్టేట్, డైమండ్, ఆభరణాలు, స్టీల్ ప్రొడక్టుల బిజినెస్ చేసే వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.

ఎక్స్చేంజ్‌ చేసుకున్న వివరాలివీ..

పేరు, అడ్రస్, నివాసం ఉంటున్న దేశం, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, సంబంధిత ఫైనాన్షియల్ ఇన్​స్టిట్యూషన్ సమాచారం, అకౌంట్ బ్యాలెన్స్, క్యాపిటల్ ఇన్​కమ్.

Latest Updates