పొగ కాదు లిక్విడ్‌‌ వస్తది..పొల్యూషన్‌‌ తగ్గించే కొత్త టెక్నాలజీ

పొల్యూషన్‌.. పొల్యూషన్‌.. పొల్యూషన్‌.. పెద్ద పెద్ద సిటీలను వేధిస్తున్న సమస్య. బండ్ల నుంచి వచ్చే పొగతో (కార్బన్‌ డయాక్సైడ్‌) జనం, వాతావరణం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. వాహనాల నుంచి పొగ రాకుండా లిక్విడ్‌ మాత్రమే వస్తే ఎట్లుంటది? ఆ టెక్నాలజీనే తయారు చేశారు  స్విస్​ఫెడరల్ ​ఇనిస్టిట్యూట్​ ఆఫ్​టెక్నాలజీ  లాసెన్​(ఈపీఎఫ్​ఎల్) సైంటిస్టులు. 90 శాతం కార్బన్‌ డయాక్సైడ్‌ను లిక్విడ్‌గా మార్చి దాని నుంచి బయో డీజిల్‌ను ఆ టెక్నాలజీతో తయారు చేయొచ్చట. ట్రక్కులు, బస్సుల్లో డ్రైవర్‌ క్యాబిన్‌కు పైన క్యాప్సూల్‌, ట్యాంక్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది పొగను తీసుకుని, నీటిని, కాలుష్యకారకాలను వేరు చేస్తుంది. స్వచ్ఛమైన కార్బన్‌ డయాక్సైడ్‌ను వేరు చేసి ద్రవంలా మారుస్తుంది. అది బయటకు పోకుండా ట్యాంకులోనే స్టోర్‌ అయ్యేలా వెసులుబాటు ఉంటుంది. ఆ కార్బన్‌ డయాక్సైడ్‌ను తర్వాత మళ్లీ ఇంధనంగా మారుస్తారు.

Latest Updates