టిక్ టాక్ కు పోటీగా విడుదలైన పోర్న్ యాప్

టిక్ టాక్ కు పోటీగా పోర్న్ యాప్ విడుదలైంది . చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలియంది కాదు.  యువతతో పాటు, గృహిణులు, పెద్దలు అందరూ టిక్ టాక్ వీడియోలు తీస్తున్నారు. తాము పోస్ట్ చేసిన బెస్ట్ వీడియోలకు లైక్స్,  కామెంట్స్ రావడంతో పాటు, ఫాలోవర్స్ కూడా పెరగడంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. దీని దెబ్బకు ఇతర సోషల్ నెట్ వర్క్ సైట్లు ఢీలా పడ్డాయంటే టిక్ టాక్ కు క్రేజ్ ఎలా ఉందో  నేటి తరానికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

అయితే దీన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ కొత్త ఆలోచనకు తెర తీసింది. టిక్ టాక్ తరహాలో ఓ పోర్న్ యాప్ ను ప్రారంభించింది. టిక్ టాక్ లో మనకు కావాల్సిన వీడియోల్ని ఎలా చూస్తామో సదరు కంపెనీ తయారు చేసిన పోర్న్ యాప్ లో కూడా అలా వీడియోలు చూడొచ్చు. నచ్చకపోతే స్వైప్ చేయోచ్చు. ఈ యాప్ ప్రయోగాత్మకంగా ప్రారంభమైందని..అడల్ట్ కంటెంట్ కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఉండదని నిర్వాహకులు తెలిపారు.

Latest Updates