సైరా మేకింగ్ అదుర్స్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కల నెరవేరింది.  ఆయన నటిస్తున్న151వ సినిమా సైరా మూవీ మేకింగ్ వీడియోను యూట్యూబ్ లో మేకర్స్ రిలీజ్ చేశారు.  సినిమాలో మెయిన్ పాత్రలను పరిచయం చేస్తూ.. వార్ విజువల్స్ ను షూట్ చేస్తున్న విధానం అద్భుతంగా ఉన్నది.  హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కూడా ఈ సినిమాకు పని చేశారు.  వందలాది మంది టెక్నిషియన్లు ఈ సినిమా కోసం పనిచేసినట్టు వీడియో చూస్తుంటే తెలుస్తోంది. మూవీలో అందరి కృషిని చూపించాలనే ఉద్దేశ్యంతో ముందుగా ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.

నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్  బిగ్ బీ అమితాబ్ కీలకమైన పాత్రను పోషించారు.

భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. తెలుగులో అక్టోబర్ 2వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నారు.

Latest Updates