సైరా ట్రైలర్ రిలీజ్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి ట్రైలర్‌ విడుదలైంది. ఒకేసారి తెలుగు, హింది, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ట్రైలర్‌ ను విడుదల చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటన ట్రైలర్‌ కే హైలెట్ గా నిలిచింది.

సైరా టీజర్‌లో నరసింహారెడ్డి పాత్రను మాత్రమే చూపించగా.. ట్రైలర్‌లో మిగిలిన ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. టైటిల్ రోల్‌ను మెగాస్టార్ చిరంజీవి పోషించగా.. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. ఇక అవుకు రాజుగా కిచ్చా సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, లక్ష్మిగా తమన్నా నటించారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Latest Updates