శ్రీకాంత్ ఖేల్‌‌ఖతం.. క్వార్టర్స్‌‌లోనే ఓటమి  

సెమీఫైనల్‌‌కు సౌరభ్, రితుపర్ణ

లఖ్‌‌నవ్‌‌: సయ్యద్‌‌ మోడీ ఇంటర్నేషనల్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నమెంట్‌‌లో  స్టార్‌‌ షట్లర్‌‌ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగియగా.. సౌరభ్‌‌ వర్మ, రితుపర్ణ సెమీఫైనల్‌‌ చేరారు. ఈ సీజన్‌‌లో ఒక్క టైటిల్‌‌ కూడా గెలవని శ్రీకాంత్‌‌..స్వదేశంలో జరిగిన బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ టూర్‌‌ సూపర్‌‌ 300 టోర్నీలో కూడా తడబాటును కొనసాగిస్తూ తీవ్రంగా నిరాశపరిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ క్వార్టర్‌‌‌‌ ఫైనల్లో మూడో సీడ్‌‌ శ్రీకాంత్‌‌ 18–21,19–21తో  వరల్డ్ మాజీ నంబర్‌‌ ‌‌వన్‌‌ సన్‌‌ వాన్‌‌ హో (కొరియా)చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సన్‌‌ వాన్‌‌తో 11 మ్యాచ్‌‌ల్లో  శ్రీకాంత్‌‌కు ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. మరో క్వార్టర్‌‌‌‌ మ్యాచ్‌‌లో సౌరభ్ వర్మ 21–19,21–16తో కున్లవుత్‌‌ వితిద్సర్న్‌‌ (థాయ్‌‌లాండ్‌‌)పై గెలుపొంది సెమీఫైనల్‌‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌‌లో రితుపర్ణ 24–26,21–10,21–19తో ఇండియాకే చెందిన శృతి ముందాడను ఓడించి టైటిల్‌‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. మహిళల డబుల్స్‌‌ క్వార్టర్స్‌‌లో ఇండియా జోడీలు  కుహూ గార్గ్‌‌– అనౌష్క పరిఖ్15–21, 9–21తో వింగ్ యుంగ్–యింగ్ఎంగాటింగ్ (హంకాంగ్‌‌)చేతిలో,  సిమ్రన్‌‌ సింఘి–రితికా థాకర్ ద్వయం7–21,16–21తో లిండా ఎఫ్లెర్–ఇసబెల్‌‌ హెర్‌‌‌‌ట్రిచ్‌‌(జర్మనీ) చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి.

Syed Modi International: Kidambi Srikanth lost his quarters match 

 

Latest Updates