సైరా కోసం రీసెర్చ్​ చేశా : సుష్మిత

  • టూ లెజెండ్స్ ఇన్ వన్ షాట్ మరిచిపోలేను
  • సైరా నరసింహారెడ్డి స్టైలిస్ట్, కాస్ట్ యూమ్ డిజైనర్ సుష్మిత కొణిదెల

హైదరాబాద్, వెలుగుస్వాతంత్య్రం కోసం పోరాడిన మొదటి యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి ముందు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వాన్ని, జీవితాన్ని చూపించనున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో మెరిసిన నటీనటుల డ్రెస్సింగ్, జ్యువెలరీ అప్పటి రాజసాన్ని, ఆ కాలం నాటి ఉనికిని తెలిపేలా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ పాత్రలకు అంత వన్నె తెచ్చేలా ఉన్న కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ వెనుక ఉన్నది స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత కొణిదెల. ఒక చారిత్రక సినిమాకు పనిచేయడం మరిచిపోలేని అనుభూతి అని తెలిపిన సుష్మిత సైరాలో తన జర్నీ గురించి అనుభవాలను ‘వెలుగు’తో పంచుకున్నారు.

వెలుగు: సైరా కి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఛాన్స్ వచ్చినప్పుడు ?

సుష్మిత: ఛాన్స్ వచ్చినప్పుడు లిటిల్ నెర్వస్ అనిపించింది. ఇంత పెద్ద సినిమాకి, ఇంత డీటెయిల్డ్ వర్క్ చేయాలని. రీసెర్చ్ చేసి మూవీ, క్యారెక్టర్స్ గురించి స్టడీ చేశాక చాలా ఎగ్జైట్ మెంట్ అయ్యా. నా స్కిల్స్ ని షోకేస్​చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం దక్కింది.

వెలుగు: తమన్నా కోసం యూజ్ చేసిన జ్యువెలరీ గురించి?

సుష్మిత:  ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇండివిడ్యువల్ జ్యువెలరీ లైన్ ఉంటుంది. ఆమ్రపాలి జ్యువెలరీ అనేది తమన్నా క్యారెక్టర్ కోసం తీసుకున్నాను. ఈ సినిమాలో తమన్నా డ్యాన్సర్ క్యారెక్టర్ చేసింది. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ కి ఒక హిస్టారిక్ ఫీల్ రావడానికి, ఒక యాంటిక్ లుక్ రావడానికి ఆమ్రపాలి జ్యువెలరీ ఫస్ట్ ఛాయిస్ గా అనిపించింది. వాళ్ల దగ్గర ఉన్న హెరిటేజ్ కలెక్షన్, ఆంటిక్ కలెక్షన్ బ్యూటిఫుల్ స్టోన్స్ తో, ఆంటిక్ గోల్డ్ తో బాగా డిజైన్ చేశారు. వీళ్లతో అసోసియేట్ అవడం చాలా హ్యాపీగా ఉంది.  ఆమ్రపాలి జ్యువెలర్స్ కి జైపూర్ లో ఒక మ్యూజియం ఉంది. అక్కడ అమేజింగ్ ఆంటిక్ జ్యువెలరీ కలెక్షన్ డిస్ ప్లే చేసి ఉంటుంది.

వెలుగు: ఈ మూవీ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, జ్యువెలరీ సెట్ చేయడానికి ఎంత టైం పట్టింది?

సుష్మిత: సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత 3,4 నెలలు రీసెర్చ్ చేశాం. దాని తర్వాత 2, 3 నెలలు ఫ్యాబ్రిక్స్ డెవలప్ చేయడానికి పట్టింది. కాస్ట్యూమ్స్ కి కావలసిన యాక్సెసరీస్, లెదర్, ఫ్యాబ్రిక్స్ కలెక్ట్ చేసుకుని డెవలప్ చేసి అవి తీసుకుని మా దగ్గర పెట్టుకుని ఆ తర్వాత కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం మొదలుపెట్టాం. ఈ సినిమాలో క్యారెక్టర్స్ కి ఒక్కో క్యారెక్టర్ కి 80, 90 కాస్ట్యూమ్స్ ఉన్నాయి. సినిమా అవుతుండగా ఆ సీన్స్ కి, షెడ్యూల్ కి తగినట్టుగా డిజైన్ చేస్తూ వెళ్లాం. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో దాదాపు 60మంది వర్క్ చేశారు.

వెలుగు: ఈ ఫ్యాబ్రిక్ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నారు?

సుష్మిత: మోస్ట్లీ ఇండియన్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశాం. మొత్తం సినిమాలో ఎక్కడా సింథటిక్ వాడలేదు. ఖాదీ, బాగల్ ప్యూర్ సిల్క్స్, హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ కి మంగళగిరి, వెంకటగిరి, గద్వాల్, కొంతవరకు ఛందేరి వాడాం. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకున్నాం.

వెలుగు: ఏ క్యారెక్టర్ కి ఎలాంటి జ్యువెలరీ యూజ్ చేశారు?

సుష్మిత:  నరసింహా రెడ్డి క్యారెక్టర్ కి, నయనతార( సిద్ధమ్మ ) క్యారెక్టర్ కి మంగత్ రాయ్ నీరజ్ నుంచి జ్యువెలరీ పిక్ చేసుకున్నాం. వాళ్ల డిజైన్స్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాయి. తమన్నా క్యారెక్టర్ వచ్చే సరికి డ్యాన్సర్. ఇద్దరు హీరోయిన్స్ కి జ్యువెలరీ లో క్లాష్ రాకుండా జాగ్రత్త పడ్డాం. తమన్నా క్యారెక్టర్ కోసం సిల్వర్ జ్యువెలరీ, ఆంటిక్ జ్యువెలరీ వాడాం. వాటిలో కుందన్స్, పోల్కిస్ సెట్స్ ఉన్నాయి. ఎక్కువగా అనామిల్ వర్క్ జ్యువెలరీ యూజ్ చేశాం.

వెలుగు: ప్రతి రోజు షూటింగ్ లో పాల్గొన్నారా? దగ్గరుండి కాస్ట్యూమ్స్, జ్యువెలరీ చూసుకున్నారా?

సుష్మిత:  ఈ సినిమా కి ప్రతి రోజు షూట్ చేయాల్సి వచ్చింది. మిగతా సినిమాలకి షెడ్యూల్ బిగినింగ్ లో ఉండి లుక్స్ సెట్  చేసేవాళ్లం. ఈ సినిమాకి ఎవ్రీ డే ఉండాల్సి వచ్చింది. క్యారెక్టర్స్ కి వేసేసి వెళ్లిపోతే అవుట్ ఫిట్స్ కావివి. సో అక్కడే ఉండి సెట్ చేయాలి, డ్యాన్స్ చేసేటప్పుడు జ్యువెలరీ పడిపోతుంటాయి. దగ్గరుండి చూసుకోవాలి సెట్స్ లో. సెట్స్ లో ఉంటేనే అవి చేయగలం.

వెలుగు: ఒక హిస్టారికల్ సినిమాకి వర్క్ చేయడం ఎలా అనిపించింది? మీ ప్రొడక్షన్ హౌజ్ నుంచి, నాన్న గారు చేస్తున్నారు? మీరు కాస్ట్యూమ్ డిజైనర్ ఆ ఫీల్ ఎలా ఉంది?

సుష్మిత:  ఈ సినిమాకి  హోమ్ ప్రొడక్షన్, మా నాన్న గారు చేస్తున్నారని కాకుండా స్టోరీనే ఇన్​స్పిరేషన్ గా ఉంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఒక మూవీ జరుగుతుంది అంటే వెరీ ఇన్​స్పైరింగ్ థింగ్. ఆయన మన తెలుగువారు. ఆయన గురించి మన కంట్రీకి చాటి చెప్పుతున్నామంటే ఒక తెలుగు పర్సన్ గా చాలా ప్రౌడ్ గా ఉంది.

వెలుగు: నాన్నగారితో కలిసి ఎన్ని మూవీస్ కి వర్క్ చేశారు?

సుష్మిత:  కౌంట్ చేయలేదు. నా ఫస్ట్ ఫిల్మ్ ఇంద్ర మూవీలో ఒక సాంగ్ కి పనిచేశా. దాని తర్వాత శంకర్ దాదా సినిమా నుంచి అన్ని మూవీస్ కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా, స్టైలిస్ట్ గా ఉన్నా. ఆయన బ్రేక్ తీసుకున్నప్పుడు నేను బ్రేక్ తీసుకున్నాను. ఆ తర్వాత నా పెళ్లి, పిల్లలు తర్వాత నాన్న కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150తో మళ్లీ ఎంటర్ అయ్యాను.

వెలుగు: మీరు మరిచిపోలేని మెమొరీ ఏదైనా ఉందా?

సుష్మిత:  అమితాబ్ గారు, నాన్నగారు ఇద్దరు కలిసి కాంబినేషన్ చేసిన షూట్. అది మోస్ట్ మెమొరబుల్ మూవ్​మెంట్. టూ లెజెండ్స్ ఒకే షూట్ లో ఉన్నప్పుడు చాలా ఎక్స్జైటింగ్ గా అనిపించింది.

‘సైరా నర్సింహారెడ్డి’ సినిమాకు అఫీషియల్ జ్యువెలరీ పార్ట్​నర్ గా వ్యవహరించిన ‘ఆమ్రపాలి జ్యువెలరీ’ సోమవారం బంజారాహిల్స్ లోని తమ స్టోర్ లో ప్రెస్ బ్రీఫింగ్ ఈవెంట్ కండక్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి క్యాస్టూమ్స్ డిజైనర్ గా వర్క్ చేసిన సుస్మితా కొణిదెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ స్టోర్ లో సినిమాలో యూజ్ చేసిన జ్యువెలరీని డిస్ ప్లే చేశారు. ఈ కలెక్షన్  సినిమా విడుదల వరకు ఇక్కడ డిస్​ప్లే లో ఉంటుందని ఆమ్రపాలి జ్యువెలరీస్ డైరెక్టర్ అనిల్ అజమెరా  తెలిపారు.

 

Latest Updates