కొనసాగుతున్న సైరా మానియా

మెగా మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఏ రోజుకారోజు స్పీడు పెంచేస్తూ ఓ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. సైరా సునామీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే సరికొత్త రికార్డులకు తెరలేపేలా కనిపిస్తోంది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా నిన్నటితో అయిదు రోజులు పూర్తిచేసుకుంది. దీంతో సైరా కలెక్షన్స్ ఇప్పటికి 75 కోట్ల మైలురాయిని దాటేశాయి. దీంతో మొదటివారంలో మెగాస్టార్ 80 కోట్ల కలెక్షన్ మైలురాయిని అందుకోవడం అనేది కేవలం లాంఛనమే అనుకోవచ్చు.  ముఖ్యంగా నెల్లూరు‌లో ఈ సినిమా ఆరో రోజు కూడా 21 లక్షల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి కొన్ని ఏరియాలలోఈ సినిమా కలెక్షన్స్ ఊహలకు కూడా అందనంత హై రేంజ్‌లో ఉన్నాయని అర్ధమవుతుంది. తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న సైరా నరసింహారెడ్డి నార్త్ లో కాస్త డీలాపడినట్లు తెలుస్తోంది. జోకర్, వార్ సినిమాలు విడుదలతో సైరాకు బ్రేకులు పడ్డాయి. దీంతో అక్కడ ఆరు రోజులకుగాను రూ.8.25 కోట్లు మాత్రమే రాబట్టింది.

Latest Updates