సైరా.. ప్రసన్న వదనం

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా నెలరోజుల తర్వాత అక్టోబర్ 2న సైరా సినిమాను  విడుదల చేయడానికి నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సినిమా నిర్మాత రామ్ చరణ్ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సైరా నరసింహారెడ్డి అంటే… ఉగ్ర రూపం… స్వాతంత్ర్య కాంక్షతో రగిలిపోయే సంగ్రామ యోధుడు మాత్రమే గుర్తొచ్చేలా పోరాటాలను ఇప్పటివరకు టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లలో చూపించారు. ఐతే… వినాయక చవితి సందర్భంగా సైరాలోని మరో కోణాన్ని రామ్ చరణ్ చూపించారన్న టాక్ వినిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా.. రేనాటి వీరుడి ప్రసన్న వదనం.. అభిమానులను ఆకట్టుకుంటోంది.

Latest Updates