పద్మారావు రాజకీయ ప్రస్థానం : కౌన్సిలర్‌ నుంచి డిఫ్యూటీ స్పీకర్ గా

తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీలో పద్మారావుగౌడ్ 2001లో చేరారు. 2004లో TRS పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో సనత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పద్మారావు .. కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మళ్లీ TRS పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ లో ఎక్సైజ్, అబ్కారీ.. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పద్మారావుగౌడ్ పని చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. అయితే TRS పార్టీలో చేరే కంటే ముందు పద్మారావుగౌడ్.. హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌ గా సేవలందించారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ డిఫ్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

1954,ఏప్రిల్ 7వ తేదీన సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్ జన్మించారు. పద్మారావుగౌడ్‌ కి స్వరూప రాణితో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

Latest Updates