డిప్యూటీ స్పీకర్‌ గా పద్మారావుగౌడ్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ గా సికింద్రాబాద్ TRS ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. పద్మారావుగౌడ్‌ను సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు కలిసి తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

Latest Updates