టీ20 వరల్డ్ కప్ ఖేల్ ఖతం

విక్టోరియా, మెల్‌ బోర్న్‌‌లో పెరుగుతున్న  కరోనా కేసులు

ఐసీసీ పోస్ట్​పోన్​ ప్రకటన చేయడం లాంఛనమే

ఐపీఎల్‌ 2020 ఎడిషన్‌ కు లైన్‌ క్లి యర్‌

టీ20 వరల్డ్ కప్ పై తుది నిర్ణయంలో ఐసీసీ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నా.. పరిస్థితులు మాత్రం రోజురోజుకు దిగజారుతున్నాయి..! టోర్నీకి వేదికలైన విక్టోరియా, మెల్​బోర్న్​లో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి..! ఇప్పటి కే పరిస్థితి పూర్తిగా చేజారిపోతున్న నేపథ్యంలో.. ఐసీసీ ప్రకటన లాంఛనంగా మారింది..! దీంతో ఐపీఎల్​ను అడ్డుకోవాలని ఐసీసీ చేస్తున్న ప్రయత్నాలకు మరికొద్ది రోజుల్లో బ్రేక్ పడబోతున్నది..! ఓవరాల్​గా మెగా లీగ్ కు దాదాపుగా లైన్​ క్లి యర్​ అయినట్లే..!

మెల్ బోర్న్: మెన్స్‌ టీ20 వరల్డ్‌‌‌‌కప్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని ఆశలు పెట్టుకున్న ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కు పిడుగులాంటి వార్త. అదే సమయంలో ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ కు జోష్‌‌‌‌  నింపే అంశం. వరల్డ్‌‌‌‌కప్‌ హోస్ట్‌‌‌‌ కంట్రీ ఆస్ట్రేలియాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసా రిగా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మెల్‌ బోర్న్‌‌‌‌లో వైరస్‌‌‌‌ వ్యాప్తి హఠాత్తుగా పెరిగిపోయింది. దీంతో టీ20 వరల్డ్‌‌‌‌కప్‌ పై ఇన్నాళ్లూ నాన్చు డు ధోరణి పాటిస్తున్న ఐసీసీ ఇప్పుడేం సమాధానం చెబుతుందో చూడాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మెగా టోర్నీ వాయిదా ప్రకటన లాంఛనంగా కనిపిస్తున్నది. ఆస్ట్రేలియాలో ఇప్పటిదాకా 7,500 మంది కరోనా బారిన పడగా, 104 మందప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో పాజిటివ్స్​ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. మరోవైపు జులై 15 నుంచి స్టేడియం కెపాసిటీలో 25 శాతం మందిని స్పోర్ట్  ఈవెంట్స్‌ కు అనుమతిస్తామని రెండు వారాల కిందట ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించడం, పెర్త్‌‌‌‌ స్టేడియం నిర్వాహకులు 60 వేల మందిని స్టేడియంలోనికి అనుమతిచ్చేం దుకు రెడీ అని చెప్పడంతో ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ రెండు ప్రకటనలతో కాస్త ధీమాగా ఉన్న ఐసీసీకి ఇప్పుడున్న పరిస్థితి ఇబ్బం దికరంగా మారింది. విక్టోరియా, మెల్​బోర్న్​లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఆస్ట్రేలియా టాప్​ సాకర్​ లీగ్​ అయిన ఏ–లీగ్‌ , నేషనల్‌ రగ్బీ లీగ్‌ మ్యాచ్‌ లను మెల్‌ బోర్న్‌‌‌‌ నుంచి తరలించారు. షెడ్యూల్​ ప్రకారం ఇదే మెల్​బోర్న్​లో టీ20 వరల్డ్​కప్​ ఫైనల్​ సహా ఏడు మ్యాచ్​లు జరగాల్సి ఉంది. క్రికెట్​ను పక్కనబెడితే.. మెల్​బోర్న్​లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు  స్థానిక ప్రభుత్వం, అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్‌ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్‌ పై ఉన్న ఆంక్షలను మరికొంతకాలం పొడిగించాలని భావిస్తున్నారు. ఒకవేళ పొడిగిస్తే .. టీ20 వరల్డ్​కప్​ కోసం 16 జట్లను తీసుకురావడం తలకు మించిన పని. ఇప్పటికే టీ20 వరల్డ్​కప్​పై చేతులెత్తేసిన క్రికెట్​ ఆస్ట్రేలియా (సీఏ) అధికారు లు తాజా విషయాలపై స్పం దించడం లేదు. అంటే దాదాపుగా వాళ్లు టోర్నీని వదిలేసుకున్నట్లే కనిపిస్తున్నది. కాబట్టి టోర్నీ పోస్ట్​పోన్​ లేదా రద్దు చేయడం మినహా ఐసీసీకి మరో దారి కనిపించడం లేదు.

Latest Updates