మిథాలీ.. సుష్మ… ఎవరి బయోపిక్ ?

taapsee-pannu-wants-to-play-late-sushma-swaraj-in-her-biopic

కెరీర్ ప్రారంభంలో చాలా విమర్శలే ఎదుర్కొంది తాప్సీ. రంగు తప్ప ఏమీ లేదన్నారు. అన్ని పాత్రలకీ సూట్ కాదన్నారు. టాప్ యాక్ట్రెస్ కాలేదన్నారు. ఆ కామెంట్స్ అన్నీ తప్పని ప్రూవ్ చేసింది. వరుస విజయాలతో దూసుకుపోతూ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పలు చిత్రాల విషయంలో మొదట ఆమె పేరే వినిపిస్తోంది. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ లీడ్‌ రోల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. కన్ఫర్మ్ కావడమే
తరువాయి.

అంతలోనే మరో బయోపిక్‌ కోసం తాప్సీని సంప్రదించారని తెలుస్తోంది. ఇటీవల మరణించిన సుష్మా స్వరాజ్‌ జీవితంపై సినిమా
తీయాలని బీటౌన్ చెందిన ఒక ప్రముఖ ఫిల్మ్ మేకర్‌‌ భావిస్తున్నాడట. సుష్మ పాత్ర కోసం తాప్సీని అడుగుతున్నట్లు తెలిసింది. దీని గురించి తాప్సీని అడిగితే… ఇంత చిన్న వయసులో అంత బరువైన పాత్ర చేయడం కంటే అదృష్టం ఏముంటుంది అంటూ తెలివిగా జవాబిచ్చిందే తప్ప ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఈ రెండు సినిమాలూ కనుక కన్ఫర్మ్ అయితే నటిగా తాప్సీ మరిన్ని మెట్లు ఎక్కడం ఖాయం.

Latest Updates