నాకు కరోనా సోకలే : తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కు కరోనా వైరస్ టెస్ట్ లు చేయగా అందులో నెగిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన.. నిబంధనల్ని ఉల్లంఘించి మతపరమైన సమావేశాలు నిర్వహించడంపై మార్చి 31 ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ తో పాటు మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుత మౌలానా క్వారంటైన్ లో ఉండగా పోలీసులు కరోనా వైరస్ టెస్ట్ లు చేయించారు. ఈ టెస్ట్ ల్లో నెగిటీవ్ వచ్చినట్లు మౌలానా సాద్ ఇండియా టుడే కు చెప్పారు.

నెగిటీవ్ రావడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణకు హాజరవుతారని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు.

మౌలానా సాద్ వల్లే  కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

తబ్లిగీ జామాత్ మీటింగ్ తో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ ఉల్లంఘనతో పాటు మౌలానా సాద్ మరియు ఇతరులతో అనుసంధానంగా ఉన్న  ట్రస్ట్ ల్లో మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేసులు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా  ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్) ను దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Latest Updates