సిటీ పోలీసులకు ట్యాబ్స్ పంపిణీ

వెలుగు: టెక్నాలజీని ఉపయోగించడంలో సిటీ పోలీసులు మరో అడుగు ముందుకువేశారు. కమిషనరేట్ పరిధిలోని పరిపాలన విభాగం, పోలీస్ డ్యూటీలను ఐటీ సొల్యూషన్స్ తో  ప్రారంభించారు. ఇందుకోసం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎంగవర్నెన్స్ నుఅమలు చేయనున్నారు. ఇందులో భాగంగా అదనపు డీసీపీ,ఏసీపీ,ఇన్ స్పెకర్్ట , సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారులకు సామ్ సంగ్ ట్యాబ్ లను సీపీ అంజనీకుమార్ సోమవారం అందించారు. బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ క్రైమ్స్ శిఖాగోయల్ తో కలిసి అధికారులకు 409 ట్యాబ్ లను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…ప్రస్తుతం కేసుల ఛేదనలో సాంకేతిక పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మొబైల్ అప్లికేషన్లను వాటిపనితీరును కూడా అధికారులకు వివరించారు. నేరాల నివారణ, గుర్తింపు కోసం పోలీసులకుఎంగవర్నెన్స్ తో పాటు మొబైల్ అప్లికేషన్ లు ఉపయోగపడుతున్నాయని సీపీ అంజనీకుమార్ చెప్పారు.

Latest Updates