భూమి ఇప్పించమని తహశీల్ధార్ కాళ్లు మొక్కిన రైతు

కొడిమ్యాల, వెలుగు: తన భూమిని తనకు ఇప్పించమని తహసీల్దార్ కాళ్ళు మొక్కిన సంఘటన జగిత్యాల జిల్లా కొడీమ్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…గ్రామానికి చెందిన కొత్తూరి ఆనందం అనే రైతు కుటుంబం గత 50 సంవత్సరాల నుండి సర్వే నంబర్ 72లోని రెండు ఎకరాల 19 గుంటల భూమిని సాగు చేసుకుంటు జీవనోపాధి పొందుతున్నారు.

కాగా చింతల్ల పల్లి గ్రామానికి స్మశానవాటిక నిర్మాణానికి రెవిన్యూ శాఖ ఈ భూమిని కేటాయిస్తున్నట్లు తెలియడంతో.. తన భూమిని తనకే కేటాయించి ఆదుకోవాలని మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో వేడుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు 3 ఎకరాల భూ పంపిణీలో భాగంగా ఆయన ఈ భూమిని కేటాయించాలని తాసిల్దార్ కాళ్ళపై పడి వేడుకున్నాడు.

Latest Updates