పార్టీలకు అతీతంగా రామ మందిరం కోసం కదిలి రావాలి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు-బండి సంజయ్

హైదరాబాద్: అయోధ్య రామాలయానికి నిధి సేకరణ బీజేపీ కార్యక్రమం కాదని.. పార్టీలకు అతీతంగా రామ మందిరం కోసం కదిలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు-బండి సంజయ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాముడు అందరికీ దేవుడే.. అన్ని పార్టీలు దేశం కోసమే పని చేస్తున్నాయని అంటున్నాయని ప్రస్తావించారు. మరి అయోధ్య రాముడి కోసం, 370 ఆర్టికల్ రద్దు కోసం బీజేపీ కార్యకర్తలే ఎందుకు ప్రాణ త్యాగం చేశారని ప్రశ్నించారు. హిందూ సమాజానికి ఎలాంటి ప్రమాదం వచ్చినా అన్ని పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హిందువు అని చెప్పుకోలేని వాడికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కమ్యూనిస్టు అయితే ఒక చేతిలో ఎర్ర జండా, మరో చేతిలో కాషాయం జండా , కాంగ్రెస్ అయితే ఒక చేతిలో కాషాయ జండా మరో చేతిలో పార్టీ జండా, టీఆర్ఎస్ అయితే ఒక చేతిలో గులాబీ రంగు జండా మరో చేతిలో కాషాయ జండా పట్టుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ముస్లిం అయితే ముస్లిం అని చెప్పుకోవచ్చు కానీ హిందువు తాను హిందువునేనని చెప్పుకోవద్దా? అని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దాదాపు 3 లక్షల మంది కర సేవకులు ప్రాణ త్యాగం చేసి.. వారి లక్ష్యాలు మన ముందు పెట్టారని బండి సంజయ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు,మోడీ రామమందిర  నిర్ణయంతో  ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలలో ఆనంద భాష్పాలు కనబడుతున్నాయని చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం  చేయాలని మోడీ భావించారని.. రామమందిరం నిర్మాణం కోసం బీజేపీ కార్యకర్తలే ప్రాణత్యాగలు చేశారని.. మిగతా పార్టీ నేతలు ఎవరు కూడా ప్రాణ త్యాగాలు చేయలేదన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తో హిందూ సంఘటిత శక్తిని చాటామని, రామ మందిరం కోసం సాధువు సజీవ సమాధి అయ్యారని తెలిపారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా రామమందిరం కోసం  అందరూ కదిలి రావాలని ఎవరి పార్టీల వాళ్లు ఆ పార్టీల జెండాలను చేతిలో పట్టుకొని మరో చేతిలో కాషాయ జెండా పట్టుకోవాలని సూచించారు. హిందువు అని చెప్పుకోవడంలో భయం ఎందుకు అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ రాముడు అని టి ఆర్ ఎస్ లో ఒక నాయకుడు మాట్లాడారు.. ఆ నాయకుడి మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకుడే అయ్యప్ప మాల వేసుకుంటాడని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వారి సంపాదన పంచితే మనిషికి రూ. 94 వేలు వస్తాయి

ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

Latest Updates