లాక్ డౌన్ లో చిన్నపిల్లలపై పెరిగిన వేధింపులు

కరోనా భయంతో విధించిన లాక్ డౌన్ అందరికీ ఇంకొన్ని సమస్యలు తెచ్చింది. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాల్లో సేఫ్టీ మరో సమస్య. పిల్లలపై లైంగిక వేధింపులు సాధారణ రోజులకంటే ఎక్కువగా ఉన్నాయి. పిల్లలపై ఏ విధంగా ఈ హింస జరుగుతుందో పేరెంట్స్ అవగాహన లేకపోవడం, పెద్దలు పిల్లలకు అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల ఈ కేసుల పేరుగుదలకు మరో కారణం. ఈ రెండు సమస్యలనూ అవేర్నెస్ పోగొడితే పిల్లలపై జరిగే క్రైమ్ చాలా తగ్గుతుంది. సోషల్ లైఫ్ అన్ని చోట్లా, అన్ని రూపాల్లో సెక్సువల్ అబ్యూజ్, హింస ఉంది. అట్లని దేనికీ పిల్లల్ని దూరం చేయకుండా పెద్దలు వాళ్లను అబ్జర్వ్ చేస్తూ ఉండాలిప్పుడు అంటున్నారు రాష్ర్ట బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ మమతా రఘువీర్.

కథలా చెప్పాలి

పిల్లల మీద లైంగిక వేధింపులు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లు చెప్పరు. మరికొన్నిసార్లు వాళ్లే ఆ విషయాన్ని గుర్తించరు. ఇలాంటి అమాయకమైన పిల్లల్ని రెండు, మూడుసార్లు వేధించినవాళ్లు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటారు. ఎవరూ లేనిది చూసి అసహ్యంగా ప్రవర్తిసతారు. కాబట్టి  పరిచయస్తులు ఎవరైనా  ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే వాళ్ల ప్రవర్తన గమనించాలని పిల్లలకు చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ని గుర్తించేందుకు వాళ్లలో  అవగాహన పెంచాలి. ఆ విషయాలను చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే కథల రూపంలో చేప్పాలి  పిల్లలకు షార్ట్ స్టోరీస్ అంటే ఇష్టం. ఆ కథల్లోని యానిమల్స్ అంటే  ఇంకా ఇష్టం. ఆ కథల్లో ఈ విషయాలను జోడిస్తూ చెబితే ఆసక్తిగా వింటారు. బాగా గుర్తుపెట్టుకుంటారు. ఒక జంతువుని మరో జంతువు గట్టిగా పట్టుకుంటే అది అరుస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న యానిమల్స్ అలర్ట్ అయి వస్తాయి. ప్రాబ్లమ్ పోతుందని చెప్పాలి.

ఆన్​లైన్​ అవసరమే..

లాక్డౌన్ సమయంలో పిల్లలు గాడ్జెట్స్ వాడటం బాగా పెరిగింది. ఆన్​లైన్​  క్లాసుల కోసం తప్పని అవసరం కూడా. కొంతమంది పేరెంట్స్  టెక్నికల్ నాలెడ్జ్ చాలా తక్కువ. పిల్లలకు గాడ్జెట్స్ ఇచ్చి వదిలేస్తారు. ఈ సందర్భంలో (ఆన్​లైన్​లో)  కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తెలియని వ్యక్తులతో పర్సన్ విషయాలు షేర్ చేసుకోవచ్చు. అందుకే పిల్లలు ఆన్​లైన్​లోఉన్నప్పుడు వాళ్ల పక్కనే కూర్చుని ఏం చేస్తున్నారో చూస్తూ, దాని అవసరం ఏమిటో అడగాలి.

సోషల్ మీడియాలో సైబర్ మాయగాళ్లు

ఆన్​లైన్  పిల్లల నూడ్ పిక్చర్స్, వీడియోలు చాలా ధర పలుకుతాయి. వాటి కోసం సోషల్ మీడియాలో మారుపేర్లతో మన చుట్టూ చాలా మంది మాటువేసి ఉంటారు. సోషల్ మీడియాలో పరిచయం పెరిగాక, మాటలతో బురిడీ కొట్టించి ఫ్రెండ్​షిప్​, లవ్ అంటూ పర్సనల్ లైఫ్​లోకి  వస్తారు. ఫొటోలు పంపించమంటారు.

సోషల్ మీడియాలో జరిగే మోసాల గురించి పిల్లలకు ముందే చెప్పాలి. అప్పుడు నష్టపోయే ప్రమాదం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లు బెదిరించినా భయపడకుండా మాకు చెప్పాలని పేరెంట్స్ పిల్లలకు చేప్తుండాలి. పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేస్తే ఆ పాస్వర్డ్ని పెద్దవాళ్లు తీసుకోవాలి. అప్పుడప్పుడూ అందులో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి.

దగ్గరివాళ్లే ఎక్కువ

కొన్ని సార్లు తమతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పడానికి పిల్లలు భయపడతారు. చిల్ర్డన్  సెక్సువల్​అబ్యూజ్ కేసుల్లో 60 శాతం తెలిసినవాళ్లు చేసినవేనని క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. వాళ్ల మీద చెబితే ఇంట్లో నమ్మరని, తిడతారని పిల్లలు భయపడతారు. అలాంటి భయమే లేకుండా ఎవరు తప్పుగా వ్యవహరించినా చెప్పాలని, తల్లి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. పేరెంట్స్ అందుబాటులో లేకుంటే 100, 1098 (చైల్డ్ హెల్ప్ లైన్)  నెంబర్లకు కాల్ చేయాలని వివరించాలి. ఈ నంబర్స్ గుర్తుండేలా ప్రాక్టీస్ చేయించాలి.

ముందే జాగ్రత్త పడాలి.

లాక్ డౌన్ సమయంలో అనివార్యంగా ఇంటిపట్టునే ఉండాల్సి రావడం డిజిటల్ మీడియాకు దగ్గరయ్యారు. ఈ టైమ్ వాళ్లపై ఫిజికల్ అబ్యూజ్, సెక్సువల్ అబ్యూజ్, డ్రగ్స్, ఆన్​లైన్​ మోసాలు, పోర్నోగ్రఫీ ప్రభావం బాగా ఉంది. ఈ సమస్యల నుంచి పరష్కారం కోరుకునే స్థితి రాకూడదు. పిల్లలు మానసికంగా కుంగిపోతారు. భయం పెరుగుతుంది. వాటివల్ల చదువులో వెనకబడతారు. జీవితంపై ఆశలు పెంచుకోరు. ఈ స్థితికి రాకుండా ఉండాలంటే?… పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్లేం చేస్తున్నారో కనుక్కోవాలి. పిల్లలు తమ చుట్టూ జరుగుతున్న విషయాలను గుర్తించరు. పేరెంట్స్ ఇంట్లో ఉంటే పిల్లలకు రక్షణ ఉన్నట్లు కాదు. వాళ్ల కదలికల్ని కట్టడి చేయకుండా కనిపెడుతూ ఉండాలి. పేరెంట్స్ ప్రతి రోజూ పిల్లలతో  అర్థ గంటైనా మాట్లాడాలి. ‘ఈ రోజు టైమ్ ఎలా స్పెండ్ చేశారో’ అడిగితే అన్నీ చెబుతారు. ఆ సందర్బంలో మిస్ బిహేవియర్ ఏదైనా ఉంటే తల్లిదండ్రులకు అర్థమవుతుంది.

– నాగవర్ధన్ రాయల

లాక్ డౌన్ కేస్ స్టడీస్

  • లాక్​డౌన్​ తర్వాత.. 14 ఏళ్ల అబ్బాయి పక్కింట్లో ఉండే ఎనిమిదేళ్ల అమ్మయిని రేప్ చేసిండు. ఆడుకునే అమ్మాయికి  మాటలు చెప్పి వాళ్ల ఇంట్లోకి తీసుకుపోయి ఈ దారుణానికి పాల్పడిండు.
  • చిన్నప్పుడే డ్రగ్స్​ కి అలవాటుపడ్డడు ఓఅబ్బాయి. పేరెంట్స్ గుర్తించి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇప్పించారు. బాగానే ఉన్నాడు. ఇప్పుడా అబ్బాయికి 17 సంవత్సరాలు. లాక్ డౌన్​ ఉంటూనే పాత పరిచయస్తులతో మాట్లాడుతూ డ్రగ్స్ మళ్లీ అలవాటైండు.
  • ఓ స్కూల్లో పిల్లల కోసం టీచర్స్ వాట్సాప్ గ్రూప్  క్రియేట్ చేశారు. ఓ అమ్మాయి తన బర్త్ డే ఫొటోలను వాట్సాప్ గ్రూపులో షేర్ చేసింది. ఆ ఫొటోలను ఒకబ్బాయి మార్ఫ్ చేసి, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిండు. అసభ్యంగా ఉన్న ఆ ఫొటోలతో పరువు పోయిందని ఆ అమ్మాయి సూసైడ్​కి ప్రయత్నించింది.
  • ఒక టీనేజ్ అమ్మాయి వాళ్ల డాడీ టాబ్ తీసుకునేది. డాడీ ఫేస్​బుక్​ అకౌంట్ ఓపెన్ చేసి పోస్టులు పెడుతూ ఉండేది. ‘నేనెలాగూ ఏ పోస్టూ పెట్టట్లేదు. ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంద’నుకుని వాళ్ల డాడీ కూడా ఏమీ అనలేదు. కొన్నాళ్లుకు ఒక లేడీ పేరుతో ఉన్న ఎఫ్​బీ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. మెసెంజర్లో ఆ ఆంటీతో చాటింగ్ చేస్తూ ఉండేది. టీనేజ్​లో వచ్చే శారీరక మార్పుల  వల్ల కంఫర్ట్​గా ఉండట్లేదని ఆ అమ్మాయి తన ఇబ్బంది చెప్పుకుంటే..‘ప్రాబ్లమ్ ఏమిటో చూపించు, ఏం చేయాలో చెబుతానని  నీ అమ్మలాంటి దానిని’ అన్నది ఆ ఆంటీ. ఆ అమ్మాయి ఫొటోలు పంపింది. ఆ ఫొటోలు ఓ వెబ్​సైట్లో ఉన్నాయి. వాళ్ల కజిన్ చూసి ఇంట్లో వాళ్లకు చెప్పిండు.

Latest Updates