ఇంటర్‌‌స్టేట్స్‌ ట్రావెల్‌పై వారంలో డెసిషన్‌ తీసుకోండి

  • ఢిల్లీ, హర్యానా, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్‌ క్యాపిటల్‌ ఏరియా (ఎన్‌సీఆర్‌‌) పరిధిలో ఇంటర్‌‌ స్టేట్స్‌ ట్రావెల్‌పై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హర్యానా, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ఢిల్లీ ప్రభుత్వాలు దీనిపై చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పింది. కేంద్రం కూడా దీనిపై మీటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ బోర్డర్లను మూసేసింది. మరోవైపు లాక్‌డౌన్‌ రూల్స్‌ను సడలించిన హర్యానా గుర్గావ్ – ఢిల్లీ బోర్డర్‌‌ను తెరిచింది. దీంతో జనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో సుప్రీం కోర్టు ఈ తీర్పు చెప్పింది.

Latest Updates