మా ప్రాణం తీసెయ్యండి.. వృద్ధ దంపతుల వేడుకోలు

నలుగురు కొడుకులున్నా అనాధల్లా మిగిలారు..

శేరిలింగంపల్లి, వెలుగు: చందానగర్​ డివిజన్​న్యూ పీఏనగర్​చెందిన విమలమ్మ, రమేష్​ దంపతులు తమను చంపేయాలని డాక్టర్లను, ప్రభుత్వాన్ని కోరారు. 70 ఏళ్లవయస్సులో వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, తమకు విముక్తి కలిగించాలని అంటున్నారు. విమలమ్మ, రమేష్​ దంపతులకు నలుగురు కొడుకులు. అందరూ బాగానే స్థిరపడ్డారు. అయినా వీరి బాగోగులు చూడడంలేదు. తల్లిదండ్రులను చూసుకోగలిగిన స్థిమందతులైనా తమను పలకరించేందుకు కూడా రాకపోవడం ముసలి దంపతులను మరింత కుంగదీస్తోంది. కేసీఆర్​ అన్నా, టీఆర్​ఎస్​ అన్నా వల్లమాలిన అభిమానం ఉన్న వీరు ప్రభుత్వ పథకాల ప్రచారం చేశారు. స్వచ్ఛభారత్​ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. వీరి సేవలను గుర్తించి మియాపూర్​లో గతంలో జరిగిన మన నగరం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్​ఈ దంపతులకు స్వచ్ఛ దూత, బెస్టు వర్కర్​ అవార్డులు అందజేశారు. అవార్డులిచ్చి సత్కరించిన మంత్రి కేటీఆర్​అయినా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

For More News..

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల లిస్టు విడుదల

చైనా బార్డర్‌లో మిస్సైల్ తో ఇండియన్ ఆర్మీ

చైనా ఫోన్లతో మనం పోటీ పడగలమా?

Latest Updates