సెల్ఫీ తీసుకుంటూ..స్టూడెంట్ మృతి..!

పెద్దపల్లి, వెలుగు:పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం వాటర్ ఫాల్స్ దగ్గర సెల్ఫీ మోజులో ఒక స్టూడెంట్ చనిపోయాడు. గోదావరిఖనికి చెందిన నాలుగు స్టూడెంట్లు వాటర్ ఫాల్స్ చూసేందుకు వచ్చి సెల్పీ దిగే ప్రయత్నం చేశారు. వారిలో యశ్వంత్ కాలుజారి నీటిలో పడి మృతిచెందినట్లు బసంత్ న‌గర్ ఎస్సై షేక్ జానీ పాషా తెలిపారు. గోదావరిఖని జవహర్ నగర్ కు చెందిన యశ్వంత్.. తాటికొండ అనిల్, రాధండి అభినవ్ కుమార్, పూల్లురి మణిదీప్ లతో కలిసి సోమవారం సబ్బితం జలపాతానికి వచ్చారని, ప్రమాదవశాత్తు నీటిలోపడ్డాడని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్

Latest Updates