చేప ప్రసాదం పిటిషన్లపై స్పందించిన తలసాని

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్వాహకుడు బత్తిన హరినాథ్ గౌడ్, పలు శాఖల అధికారులు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని బత్తిన హరినాథ్ గౌడ్ చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామన్నారు.

1845 సంవత్సరంలో ఈ చేప మందు పంపిణీ ప్రారంభించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ 5 సంవత్సరాలు చేప ప్రసాదం పంపిణీ అద్భుతంగా చేసామన్నారు. “ఆస్తమా వ్యాధి గ్రస్తులు ఈ చేప ప్రసాదం తీసుకుంటే మంచి జరుగుతోందని నమ్ముతారు. అందుకే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు.  కొంత మంది చేప మందు పంపిణీపై హైకోర్టులో పిటిషన్స్ వేస్తూ పక్కదారి పాటించాలని చూస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీకి వచ్చే ప్రజలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశాం ” అన్నారు తలసాని.

Latest Updates