KCR పుట్టినరోజు వేడుకలు రద్దు : తలసాని

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఆయన జన్మదిన వేడుకలను రద్దు చేసినట్టు మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నిన్న గురువారం సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి కేసీఆర్ కలత చెందారని అన్నారు. ఫిబ్రవరి 17న తన బర్త్ డే సెలెబ్రేషన్స్ జరపవద్దని క్యాడర్ కు కేసీఆర్ సూచించినట్టు చెప్పారు. జలవిహార్ లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకోసం కొద్దిరోజులుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఐతే… కేసీఆర్ సూచనలతో వేడుకలను రద్దు చేసినట్టు తలసాని వివరించారు. ఐతే… సామాజిక కార్యక్రమాలైన రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ లాంటివి చేయొచ్చని కార్యకర్తలు, నేతలకు చెప్పారు.

Latest Updates