కాలం చెల్లిన లీడర్లతో బీజేపీకి ఒరిగేదేమి లేదు:తలసాని

తెలంగాణలో బీజేపీతో పెద్దగా ఒరిగేది ఏముండదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎప్పటికైనా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే కానీ బీజేపీ కాలేదన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన తలసాని.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్నంత ఓటు బ్యాంకు బీజేపీకి లేదన్నారు. ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకుంటే బీజేపీకి ఒరిగేది ఏముండదన్నారు. తెలంగాణలో బీజేపీలోకి వెళ్లినా వారు  4 సంవత్సరాలు పోరాటం చేసే అవకాశం లేదన్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీ ఎప్పటికీ బలోపేతం కాలేదన్నారు. మాజీ ఎంపీ వివేక్ ప్రభావం కొంత వరకే ఉంటుందన్నారు.. పెద్దపల్లిలో మాత్రం బీజేపీకి ఓటు బ్యాంకు లేదన్నారు.

టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నా టీఆర్ఎస్ లోనే ఉంటారని అన్నారు తలసాని.  సెప్టెంబర్17న చాలా మందిని తీసుకెళ్తే బీజేపీకి ఫలితం ఉంటుంది కానీ.. ఒకరిద్దరితో వెళ్తే ఏముంటుందన్నారు..సందర్భాన్ని పట్టి కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నామని..బీజేపీ వాళ్లకు ఓటు బ్యాంకు ని పెంచుకోవడం తెలియదు…ఓల్డ్ సిటీ లో ఆలె నరేంద్ర బలంగా ఉండే బీజేపీ వాళ్ళు ఎందుకు కపాడుకోలేకపోయారు.

Latest Updates