బిజినెస్ మేన్ నుంచి.. పొలిటీషియన్ గా మంత్రి తలసాని

హైదరాబాద్ కు చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965 అక్టోబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటేశం యాదవ్, లలితాబాయి . ఇంటర్ వరకు చదివిన తలసాని రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్ చేసేవారు. తలసానికి భార్య సువర్ణ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
టీడీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించిన తలసాని.. 1994లో సికింద్రాబాద్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 నుంచి 1998 వరకు చంద్రబాబు కేబినెట్ లో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. రెండోసారి టూరిజం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008లో సికింద్రాబాద్ బైపోల్ లో మూడోసారి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున… సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ కేబినెట్ లో 2014 నుంచి 2016లో వాణిజ్య పన్నుల మంత్రిగా పని చేశారు. 2016 నుంచి 2018 వరకు మత్సశాఖ మంత్రిగా సేవలందించారు. గత ఎన్నికల్లో రెండోసారి సనత్ నగర్ నుంచి విజయం సాధించిన తలసానికి…. మరోసారి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది.

Latest Updates