
ఈనెల 25లోగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు అద్దంలా మెరవలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు.. ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు మంత్రులు తలసాని..మహమూద్ అలీ. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని.. రేపటి నుంచి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని చెప్పారు. పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ.. ప్రైవేట్ స్కూల్స్ లో సమస్యలపై చర్చించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో..టీచర్లు మాట్లాడాలని సూచించారు. విద్యార్థులకు సానిటైజర్లు, మాస్కులు అందిస్తామన్నారు మంత్రులు.
see more news