కాంగ్రెస్, బీజేపీ నేతలు కుక్కల్లా అరుస్తున్నారన్న మంత్రి

కాంగ్రెస్ ,బీజేపీ నేతలు కుక్కల్లా అరుస్తున్నారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సోమవారం పొద్దున మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్థిక మాద్యంలోనూ బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరు నెలల కృషిచేస్తే ఇంత అద్భుతమైన బడ్జెట్ ను తయారు చేయడం కుదిరిందన్నారు. ఈ బడ్జెట్ ను ఆర్థిక రంగ మేధావులు స్వాగతించారని చెప్పారు. అన్ని వర్గాలకూ కెటాయింపులు జరిగాయని… బీసీల ఉన్నతికి తోడ్పడే అంశాలు బడ్జెట్ లో చాలా ఉన్నాయని తెలిపారు.  70 యేండ్ల తర్వాత బీసీ లకు తెలంగాణ లో న్యాయం జరుగుతోందని అన్నారు.

అందరూ జ్యోతి రావు పూలే పేరు చెప్పుకున్నారు ..కానీ ఆయన ఆశయాలను నిజంగా అమలు చేస్తున్నది trs సర్కారేనని అన్నారు తలసాని. జ్యోతి రావు పూలే విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. దేవాలయాల అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించిన ఘనత కెసిఆర్ దేనని అన్నారు. కేవలం మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలనే రీతిలో కాంగ్రెస్ ,బీజేపీ లు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని అన్నారు. బీసీ లకు సబ్ ప్లాన్ కన్నా ఎక్కువ మేలు జరిగే నిధులు బడ్జెట్ లో కేటాయించామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు తొందర లేదని త్వరలోనే కడతామని తెలిపారు.

Latest Updates