టూరిస్టుల్లాగా వచ్చి…తమషా చేస్తున్నారా

హైదరాబాద్ లో 40 వేల మంది రోహింగ్యాలుంటే కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర మంత్రులు టూరిస్టుల్లాగా వచ్చి…తమషా చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులకు హైదరాబాద్ లో ఏం పని అని… తమ ప్రాంతాల్లోని అభివృద్దిని వాళ్లు చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ వాళ్లను చూస్తుంటే…గోసవుతుందని వాళ్ల మేనిఫెస్టోను చూస్తే నవ్వొస్తుందన్నారు. కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కు హైదరాబాద్ గురించి ఏమి తెలుసని…దమ్ముంటే రోహింగ్యాలను దేశం నుంచి బహిష్కరించాలన్నారు.

Latest Updates