కిషన్ రెడ్డికి నేనే ఫోన్ చేశా..రమ్మంటే రానన్నారు

మెట్రో లాంచ్ కు తనను పిలవలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనడం సరికాదన్నారు మంత్రి తలసాని. మెట్రో ఓపెనింగ్ చేసే ముందు రోజే  పొద్దున 11.30 కు తాను కిషన్ రెడ్డికి ఫోన్ చేశానన్నారు. రమ్మంటే తనకు పార్లమెంట్ ఉంది రాలేను అని కిషన్ రెడ్డి చెప్పారన్నారు. మెట్రో ఓపెన్ చేసినప్పుడు ఫ్లెక్సీలపై ప్రధాని ఫోటో పెట్టామన్నారు. కావాలంటే ఆ ఫ్లెక్సీలు ఇప్పటికీ ఉన్నాయని చూపెడతామన్నారు. లక్ష్మణ్ తన స్థాయి తగ్గట్టుగా మాట్లాడాలన్నారు. .కేటీఆర్ ను విమర్శించే అర్హత తనకు లేదన్నారు. లక్ష్మణ్ వల్ల బీజేపీకి ఒరిగిందేమి లేదన్నారు. మన రాష్ట్రానికి నీతి ఆయోగ్ డబ్బులు ఇవ్వాలని చెప్పినా ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రాలకు వచ్చే డబ్బులకు మోడీ ప్రభుత్వం గండి కొడుతుందన్నారు. ఓల్డ్ సిటీని తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేశామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చేలా కృషి చేయాలన్నారు.

Latest Updates