అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల దాడి.. 20మంది మృతి

అఫ్గానిస్తాన్ లో తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20మంది భధ్రతా సిబ్బంది చనిపోయారు. అఫ్గానిస్తాన్ లోని పశ్చిమ బాద్గీస్.. గవర్నమెంట్ హెడ్ క్వాటర్స్ పై గురువారం ఉదయం నాలుగు గంటలకు తాలిబన్ లు దాడి చేసినట్టు అబ్దల్ హజీజ్ బేగ్ అనే అధికారి తెలిపాడు. ఈ ఘటనలో భధ్రతా బలగాలతో పాటు పోలీసులు కూడా మృతి చెందినట్టు చెప్పారు. ఇప్పటివరకు 20మంది మృతి చెందినట్లుగా తెలిపారు.. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అఫ్గాన్ అధికారులు చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ కు చేర్చమని తెలిపారు. దాడికి తాళిబన్లు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకుగాను తాలిబన్ నేత యూసఫ్ అహ్మదీ ఓ ప్రకటన చేశారు.

Latest Updates