కాబుల్ లో పేలుడు..ఐదుగురు మృతి

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ లో కారు బాంబ్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. సోమవారం అర్థరాత్రి గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్ దగ్గర  ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్న చోట ఓ అగాంతకుడు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహ్మి మాట్లాడుతూ..ఈ దాడిలో కనీసం ఐదుగురు పౌరులు మరణించగా..50 మంది గాయపడ్డారని తెలిపారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.  అనేక ఇళ్ళు ధ్వంసం అయినందుకు మృతుల సంఖ్య పెరిగనుందని అన్నారు. మరోవైపు ఈ దాడిని తామే జరిపినట్లు తాలిబన్లు ప్రకటించారు.

Latest Updates