చెప్పురా చరణ్.. ఏం చెప్పాలి?

  • సైరా సక్సెస్ మీట్ లో తమన్నా

తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో తెరకెక్కిన చిత్రం సైరా.. బాక్సాఫీస్ వద్ద అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. సినిమా చూసిన ఆడియన్స్ ఉద్వేగంతో.. కంటతడితో.. థియేటర్ నుంచి బయటకొస్తున్నారు. ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ తో సినిమా భారీ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.

సినీ అభిమానుల ఊపు చూసి సైరా టీమ్ రిలీజైన రెండో రోజే సక్సెస్ మీట్ పెట్టింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ప్రొడ్యూసర్, మెగా హీరో రామ్ చరణ్, సైరా రోల్ లో జీవించిన మెగాస్టార్ చిరంజీవి, కథానాయకి తమన్నా సహా టీం అంతా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.

సక్సెస్ మీట్ లో తమన్నా స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గతంలో తనతో కలిసి నటించిన రామ్ చరణ్ ను ఆమె ‘చెప్పరా’ అంటూ పిలవడంతో వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఆడియన్స్ కు ఈ వేదిక ద్వారా తెలిసింది.

టీమ్ సభ్యులందరికీ థ్యాంక్స్ చెబుతూ వచ్చిన తమన్నా చరణ్ గురించి ఇలా మాట్లాడింది…

‘‘చెప్పురా చరణ్. నువ్వు కో యాక్టర్ గా బెటరా… ప్రొడ్యూసర్ గా బెటరా? ఏం చెప్పాలిరా? నువ్వు ఎందులో బెటరో చెప్పరా చరణ్. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. లక్ష్మి కేరక్టర్ కి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్స్’’ అని చెప్పింది.

లక్ష్మీ నరసింహా రెడ్డిగా గర్వపడుతున్నా

‘లక్ష్మీ నరసింహారెడ్డిగా నన్ను పిలిస్తే గర్వపడతా. ఇంత వరకు నిహారిక, అవంతిక అని గతంలో చేసిన సినిమా రోల్స్ తో పిలిపించుకున్నా. ఇవాళ నన్ను లక్ష్మీ నరసింహా రెడ్డి అని పిలచారు. ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంతకు మించిన పెద్ద కాంప్లిమెంట్ లేదు. ఇది చాలా పెద్ద అచీవ్ మెంట్’ అని చెప్పింది తమన్నా.

‘ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సురేందర్ గారి థ్యాంక్స్. మళ్లీ మీరు సినిమా చేస్తే నన్ను మర్చిపోవద్దు. ఏదైనా సినిమాలో మీరు ఒక్క షాట్ కోసం పిలిచినా వస్తా’ అని చెప్పింది.

చిరూ సార్.. మీతో చాలా సినిమాలు చేయాలి

‘‘చిరూ సార్.. మీ డ్రీమ్ ప్రాజెక్టులో నన్ను తీసుకున్నందుకు థ్యాంక్స్. మీ దగ్గరి నుంచి చాలా నేర్చుకోవాలి. అందుకోసం మీతో చాలా సినిమాలు చేయాలి. మీరు సినిమా తీసే ముందు నన్ను గుర్తు చేసుకోండి. నాకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి’’ అని మెగాస్టార్ ని కోరింది తమన్నా.

Latest Updates