చింతపండుతో మొటిమలు, మచ్చలకు చెక్ ..

ముఖం మీద చిన్న మొటిమ కనిపించినా.. కొంచెం మచ్చ పడ్డా  మార్కెట్​లో దొరికే ఏవేవో క్రీములు వాడుతున్నారు. రెడీమెడ్​ ఫేస్​ప్యాక్​లు, స్ర్కబ్​లతో అందానికి మెరుగులు దిద్దుతున్నారు. కానీ కెమికల్స్​తో నిండిన వాటివల్ల  లాంగ్‌టైమ్‌లో చర్మానికి  హాని తప్ప మేలు ఉండదు. అందువల్ల  ఖరీదైన కాస్మోటిక్స్​​కి కాస్త  బ్రేక్​ ఇచ్చి చింతపండు ఫేస్​ప్యాక్​, స్క్రబ్బర్‌లను ఇంట్లోనే తయారుచేసుకుని వాడండి. దీనివల్ల  మెటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ఫేస్​ స్క్రబ్​

ఒక టేబుల్​ స్పూన్​ చింతపడుని వేడి నీళ్లల్లో ఉడికించి గుజ్జు తీయాలి. అందులో ఒక టీ స్పూన్​ చక్కెర,  ఒక టీ స్పూన్​ మిల్క్ ​క్రీమ్ వేసి బాగా కలిపి ​ముఖం, మెడభాగాలకు పట్టించాలి. చేతివేళ్లను గుండ్రంగా తిప్పుతూ పదినిమిషాలు మసాజ్​ చేయాలి. ఈ ప్యాక్​ తరచూ వేసుకుంటే  చింతపండు గుజ్జులోని  ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్​చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. పొడిచర్మం ఉన్నవాళ్లు మిల్క్​క్రీమ్​కి బదులు పెరుగు వాడొచ్చు.

స్కిన్ ​లైట్‌నింగ్​ ప్యాక్​

ముప్పై గ్రాముల చింతపండుని ఒక కప్పు  నీళ్లలో వేసి  మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.  చల్లారాక చింతపండు గుజ్జు తీయాలి. అందులో అర టీ స్పూన్​  పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచి  తరువాత శుభ్రం చేయాలి. ఇలా రెండురోజులకొకసారి చేస్తే  పసుపు, చింతపండులో ఉండే   యాంటీ ఆక్సిడెంట్​ గుణాలు మృతకణాలను,  ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని మెరిపిస్తాయి.

Latest Updates