ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

Tamil director J. Mahendran passes away says His son

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ మహేంద్రన్ ఈ రోజు గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత నెల 27న అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన మహేంద్రన్ మంగ‌ళ‌వారం ఉదయం మృతి చెందినట్లు ఆయన కుమారుడు జాన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధి వ‌ల్ల గ‌త కొన్నిరోజులుగా బాధ ప‌డుతున్న‌ మ‌హేంద్రన్‌కు వెంటిలేట‌ర్ ద్వారా చికిత్స అందించామ‌ని, ఆయ‌న శ‌రీరం అందుకు స‌హ‌క‌రించ‌క ఈ ఉదయం క‌న్నుమూసిన‌ట్లు వైద్యులు తెలిపారు.

రజనీ నటించిన ముల్లమ్ మలరమ్ చిత్రంతో దర్శకుడిగా మ‌హేంద్ర‌న్ తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 1980లో ఆయన రూపొందించిన నేంజథాయ్ కిలాథే చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. మహేంద్రన్ మరణం పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. మహేంద్రన్ తమిళ సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.

Latest Updates