జల్లికట్టులో అప‌శృతి.. భవనం కూలి ముగ్గురు మృతి

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టు ఆట చూడటానికి భారీగా పచ్చిన ప్రజలు పాడు బడ్డ భవనం పై ఎక్కడంతో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి సహ ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వెంటనే గాయపడిన వారిని కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

భవనం పైనుంచి జ‌ల్లిక‌ట్టు ఆటను చూస్తున్న వారు గుంపుగా నిలబడటంతోనే గోడ కుప్పకూలినట్లు తెలుస్తోంది. పైన నిలబడిన కొందరు జారిపడటంతో పాటు.. పైనుంచి గోడ శకలాలు కూడా మీద పడటంతో గాయపడ్డవారి సంఖ్య పెరిగింది. గాయపడ్డ వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెప్పపాటులో శకలాలు మీదపడటంతో కింద ఉన్నవారు తప్పించుకోలేపోయారని స్థానికులు సైతం తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Latest Updates