నేత్రదానం ప్రకటించిన తమిళనాడు సీఎం పళనిస్వామి

తమిళనాడు సీఎం పళనిస్వామి జాతీయ నేత్రదానం ఫోర్ట్‌ నైట్‌ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఐ డొనేట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. అంధత్వం లేని సమాజం నిర్మాణానికి కళ్లు దానం చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సీఎం.

పళనిస్వామికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తమిళనాడు రాష్ట్ర అంధత్వ నియంత్రణ సంఘం, రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్‌వీ చంద్రకుమార్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. పళనిస్వామి గర్వించదగిన కంటి దాత అని.. తన కళ్లను బహుమతిగా ఇవ్వడం ద్వారా తన దేశాన్ని అంధత్వరహితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆ సర్టిఫికేట్ తెలిపింది. దేశంలో ప్రతి ఏడాది ఆగస్ట్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నేషనల్‌ ఐ డొనేషన్‌ను ఫోర్ట్‌ నైట్‌గా పాటిస్తారు.

 

Latest Updates